Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లాఖాద్రి, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర బుధవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 25న ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్లను క్రీడాభిమానులకు పారదర్శకంగా విక్రయించాలని కోరారు. 25 శాతం టికెట్లనే ఆన్లైన్లో ఉంచారనీ, 75 శాతం టికెట్లు బ్లాక్‌మార్కెట్ ద్వారా అమ్మడానికి కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌ను అధిక ధరల నుంచి కట్టడి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెర్లకంటి శ్రీకాంత్, నాయకులు మాజీద్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.