Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాగు అవతల శ్మశానవాటిక.. దహన సంస్కారాలకు ఇక్కట్లు
నవతెలంగాణ-సిరికొండ
అధికారులు, ప్రజాప్రతినిధుల అనాలోచిత నిర్ణయం.. చనిపోయిన వారికీ 'అంతిమ' కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ప్రభుత్వం నిర్మించిన శ్మశాన వాటికను వాగులో నిర్మించడంతో వెళ్లలేని పరిస్థితి. మరో శ్మశాన వాటికలో చేయాలంటే పాడె మోస్తూ వాగును దాటాల్సిన దుస్థితి. ఇదీ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పరిస్థితి. ఇటీవల శ్మశాన వాటికను బసానిచెరువు కట్ట కింద వాగులో నిర్మించారు. అక్కడికి వెళ్లేందుకు వీలు లేకుండా మారింది. దీంతో పాడెను మోసుకుంటూ వన్పల్లి పోశవ్వ వాగును దాటి అవతల శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేస్తున్నారు.