Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామంలో అడుగుపెట్టొద్దంటూ హెచ్చరిక
- గటుప్పల్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల దిష్టిబొమ్మలతో శవయాత్ర
నవతెలంగాణ-చండూర్
నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్లో పార్టీ ఫిరాయింపుదారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రాత్రికి రాత్రే పార్టీని ఫిరాయించిన జెడ్పీటీసీ, గటుప్పల్ ఎంపీటీల దిష్టిబొమ్మలకు బుధవారం గ్రామస్తులు చావుడప్పులతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. గ్రామంలోకి వారు అడుగుపెట్టొద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గటుప్పల్ ఎంపీటీసీ అవ్వారు గీతా శ్రీనివాస్, చేరిపల్లి భాస్కర్ రాత్రిరాత్రే బీజేపీలో చేరారు. వారి ఫిరాయింపులపై కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు నిరసిస్తూ డప్పులతో శవయాత్ర నిర్వహించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచి.. బీజేపీలో చేరడాన్ని ఊరికి ఊరు కదిలి ముక్త కంఠంతో ఖండించారు. గట్టుప్పల్లో అడుగు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రోజా, అచ్చిన శ్రీను, కౌన్సిలర్ అనేపర్తి శేఖర్, టీఆర్ఎస్ నాయకులు చేరిపల్లి ఆంజనేయులు, బిపిఎల్ గౌడ్, ఇడ్డం గణేష్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.