Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- నవతెలంగాణ జర్నలిస్ట్ రత్నాకర్‌కు అక్కినేని మీడియా అవార్డ్
నవతెలంగాణ-కల్చరల్
రాజకీయ, పారిశ్రామిక రంగాల మాదిరిగా పత్రికా రంగంలోనూ వ్యాపార ధోరణి పెరిగిందని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో జరిగే తప్పులను చూపే బాధ్యత విలేకరులపై ఉందన్నారు. బుధవారం విఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై శృతిలయ ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వహణలో వార్త వ్యాఖ్యాతలకు, పత్రికా విలేకరులకు ''అక్కినేని మీడియా అవార్డ్స్-2022'' ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను వార్డు సభ్యుని స్థాయి నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవడంలో పత్రికల పాత్ర విస్మరించలేమన్నారు. అనంతరం ప్రముఖ సినీ పాత్రికేయులు సి.ఉమామహేశ్వరరావుకు అక్కినేని జీవనసాఫల్య పురస్కారం బహూకరించారు. దీప్తి వాజ్‌పేయి, క్రాంతి, సత్య భవాని, కల్పనకు వార్త వ్యాఖ్యా పురస్కారాలు.. రత్నాకర్ (నవతెలంగాణ), భాస్కర్, దార సత్యనారాయణ, నాగమణి, హరిత, కరుణాకర్ తదితరులు అక్కినేని మీడియా అవార్డులు అందుకున్నారు. సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ అధ్యక్షత వహించిన సభకు బండారు సుబ్బారావు స్వాగతం పలికారు. వేదికపై పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, బండ శ్రీనివాస్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అమని బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.