Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేయండి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాల విద్య, గిరిజన సంక్షేమ విద్యకు సంబంధించిన స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. అందుకనుగుణంగా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. పాఠశాల విద్య పరిధిలోని మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేస్తామంటూ గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తారంటూ తాము భావించామని తెలిపారు. కానీ అది అమలు కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కనీసం దసరా సెలవుల్లోనైనా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.