Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు: హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు సహకరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా యని అభిప్రాయపడింది. సొసైటీ వ్యవహా రంలో సుప్రీంకోర్టు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చిందనీ, ఈనెల 8న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా వాటికి విద్యుత్, నల్లా కనెక్షన్లకు అధికారులు అనుమతివ్వడం సరికాదని అభిప్రాయపడింది. కింది కోర్టుల నుంచి ఆ విధమైన ఉత్తర్వులు వెలువడకుండా జీహెచ్ఎంసీ అధికారులు న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా విద్యుత్, తాగు నీటి సరఫరా కనెక్షన్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీకి చెందిన పలువురు దాఖలు చేసిన రిట్‌ను మంగళ వారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు. అయ్యప్ప సొసైటీ విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలం టూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలు పూర్తి అవుతున్నా ఎందుకు చర్యలు తీసు కోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్, నీరు కనెక్షన్లకు అను మతి ఇవ్వాలనే కేసుల్లో అవినీతి నిరోధక శాఖను ప్రతివాదిగా చేస్తే సం బంధిత అధికారుల గుట్టు రట్టవుతుందని వ్యాఖ్యానించింది. దీనిపై జీహెచ్ఎంసీ పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.