Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రయి వేటు ఆస్పత్రులు, డయాగస్టిక్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురు వారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా, క్వాలిఫై సిబ్బంది లేని వైద్యశాలలన్నింటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్పర్శ స్కిన్, ఈఎన్టీ, సిద్ధి హాస్పిటల్, యుద్ధ డయాగస్టిక్ సెంటర్లను సీజ్ చేశామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేని ప్రయివేటు ఆస్పత్రులు, డయాగస్టిక్ సెంటర్స్, పాలిక్లినిక్లు, ఫిజియో థెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవడానికి ప్రోగ్రామ్ ఆఫీసర్లను నియమించామన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అనుమతులు లేని క్లీనిక్లపై చర్యలు తీసుకుంటామన్నారు.