Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలను ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు కుట్ర
- త్వరలోనే కరీం'నగరానికీ' బస్తీ దవాఖానాలు
- డెంగ్యూ డేంజరే.. భయపడాల్సిన అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'దేశంలో ఆహార నిల్వలు నిండుకుపోయిన పరిస్థితుల్లో అన్నపూర్ణగా ఉన్న తెలంగాణపై కేంద్రానికి కడుపు మండుతోంది. ఎనిమిదేండ్లలో సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధిస్తే.. ఆ పంటను కొనేందుకు ప్రతిసారీ కొర్రీలు పెడుతూ రాక్షసానందం పొందుతోంది. ప్రతి ఊరిలో ప్రభు త్వమే ధాన్యం సేకరిస్తుంటే.. ఇప్పుడు ఆ కొనుగోలు బాధ్యతను ప్రయివేటు ఏజెన్సీలకు కట్టబెట్టే కుట్ర చేస్తోంది' అని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సమ స్యనూ ప్రణాళికాబద్ధంగా పరిష్క రించుకుని సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు ప్రభుత్వం కండ్లుగప్పి రాష్ట్ర సరి హద్దులు దాటి స్తున్నారని, పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు దాడులు చేస్తున్నా.. మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజలే టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి అక్ర మార్కులను ఎక్కడికక్కడ పట్టుకుని అధి కారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో పలువురిపై పీడీయాక్టులు పెట్టి కఠిన చర్యలు తీసున్నామని చెప్పారు. జిల్లాలో డెంగ్యూ ప్రబలుతోందని, ప్రజలంతా డ్రైడేలో భాగస్వాములై దోమలను పారదోలాలని పిలుపు నిచ్చారు. డెంగ్యూ డెంజరేగానీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అత్యాధునిక ప్లేట్లెట్ మిషన్ అందుబాటులో ఉందని తెలిపారు.
హైదరాబాద్‌కే పరిమితమైన బస్తీ దవాఖానాలు కరీంనగర్లోనూ త్వరలోనే ప్రారంభి స్తామని చెప్పారు. రెండు మల్టీ నర్సింగ్హోంలూ ఏర్పాటు చేస్తామని తెలిపారు.