Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ కేటగిరీల్లో రాష్ట్రానికి 13 అవార్డులు
- అక్టోబర్ 2న అందజేయనున్న రాష్ట్రపతి
- అవార్డులే కాదు.. నిధులూ ఇవ్వాలి : ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వచ్ఛభారత్ మిషన్‌లో అద్భుత ఫలితాలతో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అదే సమయంలో వివిధ కేటగిరీలో 13 అవార్డులను దక్కించుకుంది. అక్టోబర్ రెండో తేదీన స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతి నిధులు అవార్డులను అందుకో నున్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ వికాస్‌శీల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశానికే ఆదర్శప్రాయ ప్రదర్శన ఇచ్చిన తెలంగాణపై ప్రశంసలు తెలిపారు. దేశంలోనే ఉత్తమ జిల్లాల కేటగిరీలో జగిత్యాల జిల్లా ద్వితీయ, నిజామాబాద్ జిల్లా తృతీయ స్థానాలను పొందాయి. జోన్ల కేటగిరీ విభాగంలో నిజామాబాద్ రెండో ర్యాంకు, భద్రాది కొత్తగూడెం జోన్ మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాయి. సుజలం1.0 క్యాం పెయిన్ క్యాటగిరీ విభాగంలో మన రాష్ట్రం తృతీయ స్థానంలో నిలిచింది. సుజలం 2.0 క్యాంపెయిన్ క్యాటగిరీ లోనూ మూడో ర్యాంకును పొందింది. నేషనల్ ఫిలిమ్ కాంపిటేషన్ విభాగంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. గోడ రాతల కాంపిటేషన్, ఓడీఎఫ్ ప్లస్ బయో డిగ్రేడబుల్ వ్యర్థాల నిర్వహణ, గోబర్‌ధాన్, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, బహిరంగ మలవిసర్జన నిషేధితం వంటి విభాగాల్లో అవార్డులతో మన రాష్ట్రంలోని సౌత్‌జోన్ మొదటి ర్యాంకు పొందింది. రాష్ట్రానికి 13 స్వచ్ఛ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అవార్డులతోపాటూ నిధుల నూ విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కీర్తికిరీటంలో ఇదో కలికితురాయి అని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత మిషన్‌లో ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలోనే తెలంగాణ అత్యుత్తమంగా నిలబడ టం గర్వకారణంగా ఉందని తెలి పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి వల్లనే ఈ అవార్డులు వచ్చాయని కొనియాడారు. అవార్డులు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, సహకరిం చిన ప్రజలకు పేరుపేరునా మంత్రి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.