Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఉద్యమంలో తన సిరాచుక్కతో ప్రజల్లో చైతన్యం రగిలించిన వ్యక్తి ఏలె లక్ష్మణ్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పూల నేపథ్యంలో 'పూలమ్మ' ఫొటో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కవిత సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ కళా రూపాలను తిలకించారు. వాటి గురించి నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ సందర్భంగా పూలమ్మ పేరుతో ఆర్ట్ గ్యాలరీ నిర్వహించడం చాలా సంతోషదాయకమని తెలిపారు. పూల కాన్సెప్ట్‌లో తెలంగాణలోని కళలను, సంస్కృతిని, శైలిని స్పృశించడం అభినందనీయమన్నారు. లలిత కళా అకాడమీని ప్రారంభించాలనే కళాకారుల విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కవిత ఈ కూడా హామీ ఇచ్చారు.
బతుకమ్మ పాటల ఆవిష్కరణ
బతుకమ్మ పండుగ సందర్భంగా 'సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో' అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని కవిత గురువారం హైదరాబాద్‌ని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జెన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మెన్ ముజీబ్, హాజ్ కమిటీ చైర్మెన్ సలీం, టీఎస్ ఫుడ్స్ చైర్మెన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.