Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములు లాక్కొంటున్నదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఆయన ఈమేరకు ఫిర్యాదు చేశారు. భూసేకరణ చట్టం-2013ను అమలు చేయకుండా అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, రైతు వేదిక, నీటిపారుదల ప్రాజెక్టు కోసం ప్రజల నుంచి భూములు సేకరిస్తున్నదని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల భూసేకరణ పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిపారు. దళితుల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన ఎలాంటి నిబంధనలు పాటించలేదనీ, వారికి తగిన న్యాయం చేయాలని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.