Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని 'ప్రత్యేక ఎకనామిక్ జోన్'గా ప్రకటించాలంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ టూ ఢిల్లీ బుల్లెట్ రైలు వేయాలని కోరారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజరు చేసేది పాదయాత్ర కాదనీ, విహార యాత్ర, కేసీఆర్ సహకార యాత్ర చేస్తున్నారు తప్ప అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో అభివృద్ధి తిరోగమనంలో ఉందని చెప్పారు.గత ఎనిమిదేండ్లుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటువన్నాయని విమర్శించారు. ఆ విషయాన్ని ఇంకా ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తుంది కానీ హైదరాబాద్ ప్రాంతానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలంటూ టీఆర్ఎస్ సర్కారును డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ మోడీ ప్రధాని కాక ముందు అదానీ ఆస్థి ఎంత? ఇప్పుడు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సరైన బుద్ది చెప్పకపోతే దేశానికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.