Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ హక్కుల సాధన సమితి డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీల ఆర్థికాభివృద్ధి కోసం తక్షణం బీసీబంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటిపాముల వెంకట్రాములు, రాయబండి పాండురంగాచారి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని రాజ్ బహుదూర్ గౌర్ హాల్ మఖ్దూం భవన్లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా,విద్య, వైద్య, ఉపాధి, అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు నాలుగేండ్ల క్రితం రుణాల కోసం దరఖాస్తు చేసి, చెప్పులరిగేలా తిరుగుతున్నా, ఇంతవరకు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదని తెలిపారు. బీసీ కులగణను చేపట్టాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 15న హైదరాబాదులో బీసీ శాఖ మంత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.