Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 వేల వేతన జీవోను విడుదల చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలనీ, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో హైదరాబాద్‌కు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ ప్రవీణ్‌కుమార్, ఎస్.రమ ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.2 వేల వేతనం ఇస్తామంటూ మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలనీ, తక్షణమే సంబంధిత జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట జరిగే ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.