Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోలీసుల వద్ద నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ కేసుల దర్యాప్తుల గురించి కూడా వివరించాలని కోరింది. తన సోదరుడు ఎన్.సీతారాములు 19 ఏండ్ల వయసులో కనిపించకుండా పోయాడనీ, ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదు చేస్తే ఫలితం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం కల్వకుంట్ల గ్రామస్తుడు ఎన్.శ్రీరాములు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ కేసు గురించి కూడా వివరించాలని ఆదేశించింది. 2006లో రామంతపూర్, పాలిటెక్నికల్ కాలేజీలో సెకండియర్ చదువుతుండగా సీతారాములు కనిపించకుండాపోయాడనీ, ఇప్పుడు అతని వయసు 35 సంవత్సరాలుంటుందని శ్రీరాములు తన రిపోర్టులో పేర్కొన్నారు.
రాజాసింగ్‌కు వసతులు కల్పించాలి
గోషామహల్ ఎమ్మెల్యే, తన భర్త రాజాసింగ్‌కు జైలులో సౌకర్యాలు కల్పించాలని ఆయన భార్య టి.ఉషాభారు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ కె. లలిత గురువారం విచారించాలని రాజాసింగ్‌కు జైల్లో మంచం, పరుపు, కుర్చీ, టేబుల్, టీవీ వంటి సౌకర్యాలతోపాటు వార్తాపత్రికలు, అవసరమైన మందులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఆయనకు ప్రాణహాని ఉన్నందున ప్రత్యేక వసతుల కల్పనకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదప్రతివాదనలకనుగుణంగా కోర్టు ఈ కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది.