Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా 300 పడకలతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని అక్టోబర్ 15న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన ఆస్పత్రిని సందర్శించి అక్కడి డైరెక్టర్ డాక్టర్ జయలత తదితరులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం 450 పడకల ఉన్నాయని తెలిపారు. కొత్త భవనం రాకతో పడకల సంఖ్య 750కి పెరుగుతుందని చెప్పారు. అమెరికాకు చెందిన డాక్టర్ అద్దంకి శరత్ నూతన భవనంలోని 300 పడకలకు సంబంధించిన పారిశుధ్యం, హౌజ్‌కీపింగ్ సౌకర్యాలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు నిర్వహణ సేవలతో పాటు, మూడేండ్ల పాటు జీతాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారని అభినందించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సుల కొరత ఉందనీ, ఈ క్రమంలో వంద మందిని నియమించు కునేందుకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు.
ఒకట్రెండు రోజుల్లో బాధ్యులపై చర్యలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమైన ఘటనలో విచారణ నివేదిక అందిందని మంత్రి హరీశ్‌రావు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.