Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించిన పెండింగ్ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ నుంచి ఆగస్టు వరకు పెండింగ్ వేతనాలకు సంబంధించిన రూ.14.14 కోట్లు విడుదల చేస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు నెలలుగా వేతనాల లేక ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దసరా పండుగ ముందు జీతాలు విడుదల కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీఎస్జీసీసీఎల్ఏ హర్షం
డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలను విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టిహరీశ్రావు, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డితోపాటు కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నతాధికారకు కృతజ్ఞతలు ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు.