Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టులు అప్రజాస్వామికం..తక్షణమే విడుదల చేయాలి
- పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగుభూమి పంచాలి : ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు ఇవ్వాలనీ, ఇంటిస్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, ఇంటిస్థలం లేని నిరుపేదలకు 120 గజాల ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయమివ్వాలనీ, పేదలకు సాగు భూమిని పంపిణీ చేయాలనే ప్రధాన డిమాండ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైందని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉందని కలెక్టరేట్ వద్ద ధర్నాకు చేసేందుకు వెళ్లిన ప్రజలను, నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. అరెస్టు చేసిన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబాబుతో పాటు మిగతావారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇండ్లు, ఇండ్ల స్థలాల పంపిణీ చేయాలని కోరారు.