Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాభిమానులపై లాఠీచార్జీకి డీవైఎఫ్ఐ ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగబోతున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల జారీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఘోరంగా విఫలమైందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ విమర్శించారు. పది రోజులుగా టికెట్ల అమ్మకాలపై హెచ్సీఏ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉప్పల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్ చుట్టూ అభిమానులు పడిగాపులు కాశారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాభిమానులు భారీ సంఖ్యలో వారు రావడంతో గంట వ్యవధిలోనే టికెట్లు అయిపోయాయని పేర్కొన్నారు. దీంతో క్రీడాభిమానులు తోపులాట, తొక్కిసలాటలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. ఈ ఘటనకు పూర్తిగా హెచ్సీఏ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. క్రీడాభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హెచ్సీఏ ముందస్తు ఏర్పాట్లు చేయ కపోవడంతోనే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. లాఠీచార్జీలో గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. హెచ్సీఏపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.