Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు ఉచితంగానే డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందించనున్నట్టు శ్రీను టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ఎండీ చిల్కా కావ్యశ్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా వ్యాపారరంగంలోకి వస్తున్న దళిత, గిరిజనులు డిజిటల్ సేవలను అందుకోలేకపోవడంతో వారి వ్యాపారాల్లో వృద్ధి ఉండటం లేదని తెలిపారు. కంపెనీ ప్రారంభించి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి వారికి తోడ్పాటునందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం www.srinutechnologies.comలో సంప్రదించాలని సూచించారు.