Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో నిర్వహించ బోయే గ్రూప్-2 రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత అవగాహన సదస్సును హైదరాబాద్‌లో ఈనెల 25న (ఆదివారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెప్ పి క్రిష్ణప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిధిగా మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, ప్రత్యేక అతిధులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్, తెలంగాణ నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి ప్రకాశ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్ గణేష్ హాజరవుతారని వివరించారు. ఈ సదస్సులో గ్రూప్-2 సిలబస్, సన్నద్ధ త, ప్రణాళికా, నోట్స్ మేకింగ్, సమయ పాలన వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరు కావాలని కోరారు.