Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న డిమాండ్స్ డే
- 19న చలో సీసీఎస్...
- టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఆర్టీసీ రక్షణ-కార్మికుల త్యాగాల దినంగా పాటించాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 15వ తేదీ డిమాండ్స్ డే పాటిస్తూ, కార్మికులంతా ఎరుపురంగు బ్యాడ్జీలు ధరించి, అనుకూల సమయంలో నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని కోరారు. సీసీఎస్ బకాయిలు చెల్లించాలనీ, పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తుల్ని పరిష్కరించాలనీ, పాలక మండలి ఎన్నికలు నిర్వహణకు ప్రతిపాదనలను రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటీవ్ సొసైటీకి పంపాలని కోరుతూ అక్టోబర్ 19న చలో సీసీఎస్ ఆఫీస్ ఆందోళనా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జేఏసీ సమావేశం శుక్రవారంనాడిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్లో చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, కత్తుల యాదయ్య, కోశాధికారి డీ గోపాల్, నాయకులు స్వాములయ్య, పీఆర్ రెడ్డి, బీ జక్రయ్య, ఏవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు. పనిభారాలు తగ్గించాలనీ, స్పెషల్ ఆఫ్ డ్యూటీలను సింగిల్ క్రూ డ్యూ టీలుగా మార్చడాన్ని ఆపాలనీ, మహిళా కండక్టర్లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకే డ్యూటీలు ఇవ్వాలనీ కోరారు. ఈపీకే, కేఎమ్పీఎల్ పేర్లతో వేధింపులు మానుకోవాలనీ, సెలవుల ఇవ్వాలనీ, అన్ని సౌకర్యాలతో రెస్ట్ రూంలు ఏర్పాటు చేయాలనీ, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2017, 2021 వేతన సవరణలు వెంటనే అమలు చేయాలనీ, జులై 2020 నుండి రావలసిన ఐదు డిఏల బకాయిలు చెల్లించాలనీ, 2013 వేతన సవరణ బాండ్స్ డబ్బులు చెల్లించాలని కోరారు. టికెట్టు తీసుకునే బాధ్యత ప్రయాణికుడిదేననీ, దాన్ని అమలు చేస్తూ సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కారుణ్య నియామాకాలు, మెడికల్ అన్ఫిట్ అయిన వారి పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు.