Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లో విడుదల కానున్నాయి. ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న పీఈసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. బీపీఈడీ, డీపీఈడీకి అబ్బాయిలు 2,205 మంది, అమ్మాయిలు 1,427 మంది కలిపి 3,632 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు.