Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబరు రెండున బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. సంబంధిత వాల్పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఆయా వేడుకల్లో పాల్గొనే వారికి చేనేత చీరెలను అందించాలంటూ ఆమె జాగృతి-యూకే విభాగానికి సూచించారు. కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు, టీఎస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్, జాగృతి యూకే అధ్యక్షుడు బల్మూరి సుమన్ రావు తదితరులు పాల్గొన్నారు.