Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి : ఆరెస్పీ ఎంపీ ప్రేమ చంద్రన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకపోవటం వల్లే బీజేపీ ఆటలు సాగుతున్నాయని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆరెస్పీ) సీనియర్ నేత, ఎంపీ ఎన్కే ప్రేమ చంద్రన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసిన ఆయన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటులో తాను, చంద్రన్ గతంలో సహచర ఎంపీలుగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బలమైన ప్రభావాన్ని చూపగలరని తెలిపారు. ఆయన వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయని వివరించారు.