Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లూజ్ వైరింగ్ వల్లే..
- మృతదేహంతో సబ్స్టేషన్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-రేగొండ
విద్యుద్ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపలపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుంపలపల్లికి చెందిన బత్తిని కొమురయ్య (45) మిరప తోటకు అచ్చు తోలెందుకు వెళ్లిన క్రమంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లకు ఇనుప కాని తాకడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లూజ్ వైరింగ్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు స్థానిక సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. కొమురయ్య మతికి కారకులైన ఏఈని, లైన్మెన్ను సస్పెండ్ చేయడంతోపాటు బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.