Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్పీసీ సమావేశంలో చైర్పర్సన్ డీ ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ పంపిణీ, సరఫరా, ఉత్పత్తిలో గ్రిడ్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సదరన్ రీజినల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) చైర్పర్సన్ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఆర్పీసీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి రాష్ట్రాల విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టం, (సోలార్, విండ్) రినవబుల్ ఎనర్జీలకు సంబంధించి సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ (సీటీయూ) ప్రతిపాదనలను చర్చించారు. ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సిస్టం, సంయుక్త నెట్వర్క్ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ చర్యలను సమీక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.