Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి తరగతి చదువుతున్న విద్యార్థులకు 'కోటా' ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్, అసైన్మెంట్(డిజిటల్) సిద్ధంగా ఉన్నట్టు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫౌండేషన్ మెటీరియల్ను డిజిటల్ మొబైల్ వెర్షన్లో వాట్సాప్ ద్వారా పొందొచ్చని సూచించింది. స్టడీ మెటీరియల్తోపాటు అసైన్మెంట్ పొందేందుకు అవకాశముందని వివరించింది. మరింత సమాచారం కోసం ఇంజినీరింగ్ విద్యార్థులు IIT Foundation, మెడికల్ విద్యార్థులు MED Foundation అని టైపు చేసి 98490 16661 వాట్సాప్ నెంబర్కు పంపించాలని ఫోరం తెలిపింది.