Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని (సీపీఐ(ఎం)
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కమ్యూనిస్టులు టీఆర్ఎస్ అధినేతకు అమ్ముడుపోయారంటూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి నోరుపారేసుకోవడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. విధానాలే ప్రాతిపదికగా పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలపై చెత్తవాగుడు మానుకోవాలని హెచ్చరించింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో మతోన్మాద బీజేపీిని ఓడించాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలు ముందుకుసాగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీని నిలవరించడం, ఓడించడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకోకుండా టీిఆర్ఎస్ను టార్గెట్గా పెట్టుకోవడమనేది కాంగ్రెస్ పార్టీకే నష్టమని తెలిపారు. ఇప్పటికైనా బీజేపీి ప్రమాదాన్ని గుర్తించి కమ్యూనిస్టులపై బురద చల్లడం మానుకుంటే మంచిదని సూచించారు.