Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సోమవారం నుంచి ఐదు రోజుల పాటు జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించబోయే సీడబ్ల్యూఎస్ఎన్ (చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్) శిక్షణా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని టీయూటీఎఫ్ అధ్యక్షులు టి.లచ్చిరామ్, ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దసరా పండుగకు సెలవులిచ్చి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం తగదని పేర్కొన్నారు. పండుగ అనంతరం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.