Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని మతాల సారం ఒక్కటే : శాంతి సమ్మేళనం(2022) లో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పరమత సహనంతోనే ప్రపంచ శాంతిని కాపాడగలమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో అహ్మదీయ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 'నిజమైన సుస్థిర ప్రపంచ శాంతి' అనే అంశంపై శాంతి సమ్మేళనాన్ని (పీస్ సింపోసియం-2022) నిర్వహించారు. సంస్థ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షులు తన్వీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేననీ, శాంతిని ప్రభోధించి, సోదరభావాన్ని పెంపొందించడమే అన్ని మతాల కర్తవ్యమని హితవు పలికారు. వాటి ఆవశ్యకతను తెలియజేప్పేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ గ్రామీణ స్థాయి నుంచి విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. అహ్మదీయ కమ్యూనిటీ జాతీయ ప్రతినిధి హుసాం అహ్మద్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్, చైనాల మధ్య వైరుధ్యాలు ఇలా, యుద్ద సంక్షోభంలో ఉందని తెలిపారు. మానవాళిని శాంతివైపు నడిపించడమే తమ కర్తవ్యంగా చెప్పారు. మీర్జా మస్రూర్ అహ్మద్ ఐదవ ఖలీఫాగా విశ్వనేతగా వ్యవహరిస్తూ పలు దేశాల్లో శాంతి సదస్సులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సాయిబాబాగౌడ్, సైదిరెడ్డి, హాలీవుడ్ డైరెక్టర్, కళింగ వంశస్థుడు ప్రిన్స్దీష్ దానేటి, జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ గోవర్థన్, మేఘన ముసునూరి, షేక్ షకీల్ అహ్మద్, నూర్ మియా తదితరులు పాల్గొన్నారు.