Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన 600 మంది అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగాపురం వెంకట్‌రెడ్డి, రాజా మల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ ముదిరాజ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నర్సయ్య, ఇతర జిల్లాల నాయకులు ఉన్నారు.