Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగోల్ టు జూబ్లీహిల్స్‌కు హైదరాబాద్ మెట్రోలో..
- ఆదివారం అర్ధరాత్రి తర్వాత కామినేని నుంచి అపోలోకు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓ ప్రాణం కాపాడేందుకు కామినేని ఆస్పత్రి నుంచి ఆపోలో హాస్పటల్‌కు గుండెను తరలించేందుకు మరోసారి హైదరాబాద్ మెట్రో ముందుకు వచ్చింది. నాగోల్ టు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు జస్ట్ 25 నిమిషాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రోరైల్లో గుండెను తరలించారు. గతంలో ఫిబ్రవరి 2021లో ఇదే విధంగా గుండెను తరలించి ప్రాణాలు కాపాడింది.
హెచ్ఎంఆర్ సోమవారం తెల్లవారుజామున గ్రీన్‌ఛానెల్‌ను ఏర్పాటుచేసి నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. ఎల్బీనగర్లోని కామినేని హాస్పటల్ డాక్టర్లు, ఇతర మెడికోలు దాదాపు ఒంటి గంటకు నాగోల్‌లోని మెట్రో స్టేషన్‌కు గుండెను తీసుకురాగా.. తక్షణమే దాన్ని మెట్రోలో కేవలం 25 నిమిషాల్లో తరలించారు. అక్కడే ఉన్న ఆపోలో హాస్పటల్ వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్ ద్వారా గుండెను హాస్పటల్‌కు చేర్పించారు. కాగా, కామినేని హాస్పిటల్లో నల్లగొండకు చెందిన బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను సేకరించి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో అవసరమైన ఒక రోగికి అమర్చేందుకు నిర్ణయించారు. అపోలో హాస్పిటల్లో ప్రముఖ గుండెవైద్య నిపుణులు, సీనియర్ కన్సల్టెంట్, కార్డియోథొరాసిక్, ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ డాక్టర్ ఎ.జి.కె గోఖలే ఇతర వైద్య బృందంతో కలిసి రోగికి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు, ప్రత్యేకంగా గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేసి, అతి తక్కువ సమయంలోనే అత్యంత వేగంగా గుండెను తరలించినందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు డా ఎ.జి.కె గోఖలే కృతజ్ఞతలు తెలియజేశారు.