Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగలబెట్టిన మహిళలు
నవ తెలంగాణ - అచ్చంపేట రూరల్
దసరా కానుకగా ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ అబాసుపాలైంది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాలో సోమవారం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను కుప్పగా పోసి మహిళలు తగులబెట్టారు. అనంతరం గిరిజన మహిళలు మాట్లాడుతూ.. నాణ్యత లేని నాసిరకం చీరలు పంపిణీ చేశారని, కట్టుకోవడానికి ఏమాత్రం పనికిరాని చీరలు ఎలా ఇస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ చీరల పేరిట దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.