Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 గ్రామాల ప్రజలు కూలీ పనులకు దూరం
నవతెలంగాణ-వెంకటాపురం
రోజు వారి కూలీ రేటు రూ.200 నుంచి రూ.600కు పెంచాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పలు గ్రామాల కూలీలు డిమాండ్ చేస్తూ పనులు బహిష్కరించారు. సోమవారం వెంకటాపురం మండలంలోని బొల్లారం, నూగురు కాలనీ, మల్లపురం, రచపల్లి, అరుగుంట పల్లి గ్రామాలకు చెందిన కూలీలతో స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బీరెడ్డి సాంబశివ మాట్లాడారు. కూలీ రేటు పెంచాలని చేస్తున్న పోరాటంలో ఇప్పటికే 14 గ్రామాలకు చెందిన కూలీలు పనులు బహిష్కరించారన్నారు. రెండు రోజుల్లో ఆ సంఖ్య 19 గ్రామాలకు చేరుతుందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి పెంచే దాకా రైతులతో పోరాడాలని తెలిపారు. రైతులు, లేబర్ అధికారులతో బుధవారం చర్చలు జరపనున్నట్టు తహసీల్దార్ నాగరాజు హామీ ఇచ్చినట్టు చెప్పారు. రైతులతో చర్చల్లో కూలీ రేటు పెంచుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆ సంఘం మండల అధ్యక్షులు గ్యానం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి హర్షవర్ధన్, కూలీలు పాల్గొన్నారు.