Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీసీఎంబీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఓపెన్ డే నిర్వహించారు. కరోనా కారణంగా రెండేండ్లుగా ఆగిపోయిన ఓపెన్ డేను తిరిగి నిర్వహించినట్టు ఆ ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినరు కె.నందికూరి తెలిపారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం,సెప్టెంబర్ 26న సీసీఎంబీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఓపెన్ డేను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం శాస్త్రవేత్తల పనులకు సంబంధించిన పోస్టర్లు,ప్రదర్శనలు నిర్వహించారు.