Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు సాధారనం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు కూడా అక్కడే కొనసాగుతూ సగటు సముద్రం మట్టానికి 4.5 కి.మీ., ఎత్తు వరకు వ్యాపించిందని తెలిపారు. దీనివల్ల సోమవారం నుంచి మూడ్రోజుల పాటు క్రింది స్థాయిలో గాలులు ఉత్తర, వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయనీ, దీనివల్ల వర్షాలు కురుస్తాయని వివరించారు. మంగళవారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపారు.