Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొండా లక్ష్మణ్ బాపూజీ అందరి వాడని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక వర్గపు నాయకుడిగా చిత్రీకరించే ప్రభుత్వ కుటిల యత్నాలను తీవ్రంగా నిరసిస్తున్నామని తెలిపారు. ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం బీసీలను కులాల వారీగా విభజించే కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారుచిట్యాల ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ సబ్బండ వర్గాలకు ఆదర్శప్రాయులని తెలిపారు.అయితే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వీరి జయంతి ఉత్సవాలలో కేవలం ఆయా కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తూ ఇతర వర్గాలను విస్మరించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇది ముమ్మాటికీ మహనీయుల ఖ్యాతిని అగౌరవ పరచడమేనని మండి పడ్డారు.