Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 11 నుంచి తిరిగి నిర్వహణ
- సవరణ షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదాపడింది. రాష్ట్రంలో బతుకమ్మ, దసరా సెలవులతోపాటు ఇంజినీరింగ్ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడంతో ఈనెల 28 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ తిరిగి వచ్చేనెల 11 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. అదేనెల 11, 12 తేదీల్లో ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ ఉంటుందని వివరించారు. 12న ధ్రువప్రతాల పరిశీలన, 12, 13 తేదీల్లో వెబ్ అప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటాయని పేర్కొన్నారు. వచ్చేనెల 16న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 16 నుంచి 18 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపుతోపాటు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.