Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కమ్యూనిస్టులంటే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానం, అపార గౌరవం, వారిని ఆయన విమర్శించలేదు...' అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమ్ముడుపోయారనే మాటను ఆయన వాడలేదనీ, సంబంధిత వీడియో చూడాలని కోరారు. రేవంత్‌తో భేటీ అనంతరం తాను సీపీఐ, సీపీఎం నాయకు లతో మాట్లాడినట్టు తెలిపారు. కాంగ్రెస్.. కమ్యూనిస్టులు సహజ మిత్రులనీ, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతుపై పునరాలోచన చేసుకోవాలని సూచించారు. దేశం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాటం చేశారంటూ, వందల ఏండ్ల పోరాట చరిత్ర వామపక్షాలకుందని గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం రెండు పార్టీలు పోరాటాలు చేశాయనీ, అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పేదల కోసం ఏండ్ల తరబడి అనేక పోరా టాలు చేశారనీ, వారి సిద్ధాంతాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రధానులు నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి, మన్మోహన్ సింగ్ తో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన వివరించారు. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను తట్టుకుని బీజేపీ మతతత్వ రాజకీయాలను అడ్డుకునేందుకు కమ్యూనిస్టులతో కాంగ్రేస్ పార్టీ కూటమి కట్టే దిశగా వెళ్తున్నదని తెలిపారు. రేవంత్ రెడ్డికి కమ్యూనిస్టులను కించప రిచే ఉద్దేశం లేదనీ, అందువల్ల ఆయా పార్టీలు రేవంత్ రెడ్డి పైన అపోహలు పడొద్దని కోరారు.