Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత ఆహార గిడ్డంగుల సంస్థ (ఎఫ్సీఐ) రాష్ట్ర స్థాయి కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఆట్రాల్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఈ.కృష్ణ చైతన్య నియమితుడయ్యాడు. హైదరాబాద్కు చెందిన 31 ఏండ్ల కృష్ణ చైతన్య పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అందరికి విద్య, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ వంటి సామాజిక బాధ్యత గల కార్యక్రమాలతో పాటు పలు వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా తరచూ నిర్వహిస్తుంటారు. ఎఫ్సీఐ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడిగా కృష్ణ చైతన్య మూడేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ రాష్ట్రంలోని ఆహార ఉత్పత్తులను నిలువ ఉంచే కేంద్రాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ అమలువుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేయనున్నాయి. ఇక, చైతన్య తండ్రి ఈ.వీ రామారావు ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో అదనపు ఎస్పీ కేడర్లో పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు.