Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే హరిప్రియ
- టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-ఇల్లందు
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడాన్ని నిరసిస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయకత్వంలో మంగళవారం కేంద్రం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని పరిశీలిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పుడు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. కేంద్రం మొండి వైఖరిని విడనాడి అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని పరిశ్రమకు అనుమతి ఇవ్వకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల రాజేందర్, ఏఎంసీ చైర్మెన్ బానోత్ హరి సింగ్ నాయక్, మున్సిపల్ చైర్మెన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, పులి గళ్ళ మాధవరావు, పరుచూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.