Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురిపై కేసు నమోదు
- రూ.33.90 లక్షలు స్వాధీనం : మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు వెల్లడి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్‌బెడ్ రూముల విషయంలో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అక్రమాలకు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.33.90 లక్షలు స్వాధీనం చేసినట్టు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డబుల్‌బెడ్ రూముల అక్రమాల విషయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టరు ఆదేశాలు, సమాచారంతో దివిటిపల్లిలో విచారణ చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులు సయ్యద్ హసన్ రాజేందర్ షాపులో పని చేసేవాడని, జాపర్ హమీర్, యాప్స్ తయారు చేయడంలో సహకరించారని తెలిపారు. వీరితో పాటు వెంకటయ్య ఇంద్రజ, మహిరన్ నుంచి డబ్బులతో పాటు రబ్బరు స్టాంపులు సైతం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసును ఛేదించిన వారిలో రూరల్ పోలీసు స్టేషన్ సీఐ రాజేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. 24 గంటలో కేసును ఛేదించిందుకు ఎస్పీ వారిని అభినందించారు.