Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగులకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను వేగవంతం చేస్తామనీ, మిల్లింగ్‌ను రాష్ట్రంలోనే చేయించాలని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి వారు వినతి పత్రం సమర్పించారు. గతేడాది వానాకాలంలో నిర్ణీత సమయంలో పూర్తి చేశామని గుర్తుచేశారు. యాసంగికి సంబంధించి బాయిల్డ్ రైస్‌ను వేగంగా ఇస్తున్నామనీ, భారత ఆహార సంస్థ వెంటనే వాటిని తీసుకునేలా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం కోసం తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. తమ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారనీ పరిశీలిస్తామం టూ హామి ఇచ్చినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసో సియేషన్ అధ్యక్షులు గంపా నాగేందర్, ప్రతినిధులు సంతోష్ కుమార్, శ్రీరాములు, శివ, రాజేందర్ గౌడ్, శశిదర్ తదితరులున్నారు.