Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఉత్తమ పర్యాటక రైల్వేస్టేషన్‌గా జాతీయ పర్యాటక అవార్డు అవార్డు అందుకుంది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ఈ అవార్డును సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డైరెక్టర్ జోగేష్ కుమార్‌కు సంయుక్తంగా అందజేశారు. భారత ప్రభుత్వ పర్యాటక శాఖ ఏటా ఈ అవార్డులను అందచేస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.