Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు పరామర్శించారు. మంగళవారం మనోహర్ నివాసానికి వెళ్లిన మంత్రి ఆందోళన చెందొద్దనీ, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పుత్రవియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని కూడా హరీశ్ రావు పరామర్శించారు. మంగళవారం హైదరాబాద్ డీడీ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి.... అకాల మరణం చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు అభిజిత్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.