Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్కు లేఖలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొంతకాలంగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలు పోస్టుకార్డు ఉద్యమానికి తెరలేపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు లేఖలు రాయటం మొదలు పెట్టారు. 'శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయునది. గ్రామ రెవెన్యూ సహాయకులం(వీఆర్ఏ) అయిన మాయందు మీరు దయ తలచి పేస్కేలు, ప్రమోషన్స్, 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా అమలు కాలేదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ జీవో రూపకంగా ఇవ్వాలని రెండు చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాం. మీమీద మేం పూర్తి నమ్మకంతో ఉన్నాం' అంటూ రాసిన లేఖను బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం అడ్రస్ పేరు రాసి పంపారు.