Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్‌కు మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో సంక్షేమ మండళ్లు రద్దు చేసి, ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరించాలని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య కోరింది. తక్షణం సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలనీ, గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రాజిరెడ్డి, ఎంవీ చారి మంగళవారం టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 18న చౌటుప్పల్‌లో సమాఖ్య ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు వారు ముఖ్యమంత్రి, రవాణా, విద్యుత్ శాఖల మంత్రుల కార్యాలయాల్లోనూ వినతిపత్రాలు సమర్పించారు. ఆర్టీసీ అప్పులను ఈక్విటీగా ప్రకటించాలనీ, బడ్జెట్లో 2 శాతం నిధులు కేటాయించాలనీ, జీహెచ్ఎంసీ నుంచి హైదరాబాద్ నష్టాలను ఇప్పించాలనీ కోరారు. వాటితో పాటు కార్మికులు, ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్లను కూడా ఆ వినతిపత్రాల్లో వివరించారు. సీసీఎస్‌కు పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరారు.