Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజన్‌వారీ టిక్కెట్ ధరలపై చర్చించే అవకాశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం బుధవారం బస్‌భవన్‌లో జరుగనుంది. దీనిలో సంస్థకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలకు బోర్డు ఆమోద ముద్ర వేయనుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా సీజన్ల వారీగా ఆర్టీసీ బస్సు టిక్కెట్ రేట్లు పెంచే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విధానం ప్రయివేటు బస్సుల్లో అమల్లో ఉంది. వారు సీజన్ రద్దీకి అనుగుణంగా టిక్కెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదే పద్ధతిని ఆర్టీసీలో అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో కొత్త పోస్టుల మంజూరీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. యాజమాన్యం దాదాపు 38 అంశాలతో బోర్డు సమావేశ అజెండాను రూపొందించినట్టు తెలిసింది.