Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవో బాధితుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చేనెల ఒకటిన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన తెలియజేయాలని నిర్ణయించామని 317 జీవో బాధితుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వర్రావు ప్రకటించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ అత్య వసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 317 బాధిత ఉద్యో గులు, ఉపాధ్యాయులందరినీ కలుపుకుని జేఏసీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు పదివేల మంది ఉద్యోగ, ఉపా ధ్యాయులు స్థానికతను కోల్పోయాలని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల ఒకటిన బతుకమ్మ ఆడుతూ నిరసన తెలియజేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 317 బాధితులైన ఉద్యో గులు, ఉపాధ్యాయులు ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దత్తాద్రి, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులతోపాటు వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.